షీ టాయిలెట్ బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ షీ టాయిలెట్ బస్సును జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. బుధవారం తెలంగాణ చౌరస్తా లో ఏర్పాటుచేసిన మొబైల్ షీ టాయిలెట్ బస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు ఈ మొబైల్ షీట్ టాయిలెట్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో మొట్టమొదటి షీ టాయిలెట్ బస్సును కోస్గిలో ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో రెండవ షీ టాయిలెట్ బస్సు ప్రారంభించడం జరిగినదని, మహబూబ్ నగర్ పట్టణానికి వివిధ పనులపై పలు ప్రాంతాల నుండి ప్రజలు ఎక్కువగా వస్తుంటారని, వారిలో మహిళలు కూడా ఉంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ మొబైల్ షీ టాయిలెట్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ బస్సులను ఎక్కువ రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ఉంచాలని మహిళలకు ఉపయోగకరంగా ఉంటాయని తెలుపుతూ, ఇలాంటి బస్సులు ఇంకా ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్రెడ్డి మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింలు వైస్ చైర్మన్ గణేష్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ నందలాల్ పవర్ మున్సిపల్ కమిషనర్ సురేందర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.