విగ్రహానికి అయ్యే ఖర్చు 50,000 రూపాయల నగదు వెంటనే అందజేసిన మంత్రి

 విగ్రహానికి అయ్యే ఖర్చు 50,000 రూపాయల నగదు వెంటనే అందజేసిన మంత్రి

 
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విప్లవ కారుడు పేదల పెన్నిది పండుగ సాయన్న గారి విగ్రహ ఏర్పాటు గురించి జిల్లా కేంద్రానికి చెందిన ముదిరాజ్ నాయకులు హైదరబాద్ లోని మంత్రి నివాసంలో  వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు విగ్రహానికి అయ్యే ఖర్చు స్వయంగా అప్పటికప్పుడు వెంటనే స్పందించండి యాభై వేల రూపాయల నగదును ఇచ్చి విగ్రహ ఏర్పాటుకు సరైన స్థలాన్ని పరిశీలించి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, కౌన్సిలర్ లు పటేల్ ప్రవీణ్ గారు,కిషోర్ కుమార్ గారు, నాయకులు గంజి వెంకన్న గారు,సాయిలు గారు,ఎర్ర వెంకటన్న గారు, విక్రం దేవ్ గారు,గంజి వెంకట్ రాములు గారు,గంజి నర్సింహులు గారు తదితరులు పాల్గొన్నారు.