లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరితే వెంటనే ఆక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వరద నీరు చేరిన రామయ్య బౌలి, బి కే రెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్ ,ఎం బి సి కాంప్లెక్స్, బృందావన్ కాలనీ ల లో పర్యటించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ
@ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావ్ చేసిన యజ్ఞ,యాగాదుల ఫలితంగా రాష్ట్రంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురుస్తున్నాయి.
@ చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి.
@జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
@ఎక్కడైనా ఇండ్లు పడిపోయేందుకు సిద్ధంగా ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలి
@కొందరు చెరువులు, నాలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు.
@అలాంటివాటిని గుర్తించి కూల్చివేయడం జరిగింది.
@అయినప్పటికీ ఇంకా కొన్నిచోట్ల నాలా లను కబ్జా చేశారు.
ప్రజలు కూడా ఎక్కడైనా పాలు
@నాళాల ఆక్రమణకు గురైన విషయాన్ని ప్రజలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి
@భారీ వర్షాల సమయంలో చెరువులు కుంటల నుండి అలుగుల ద్వారా వచ్చిన నీరు సులభంగా వెళ్లేందుకు నాళాలు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి
@ఎం బి సి కాంప్లెక్స్ సెల్లార్ లో ఉన్న దుకాణాల్లో కి నీళ్ళు చేరడం చూసిన మంత్రి సెల్లార్ ను వాహనాల పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించుకోవాలని పై అంతస్తుల్లో షాపులు నిర్వహించుకోవాలని సూచన.
@మహబూబ్ నగర్ పట్టణం చుట్టూ చెరువులు ఉన్నందున అలుగులు పారి వర్షపు నీరు కాలనీలలో కి వస్తున్నది
@ ఈ సమయంలో వర్షపు నీటి కారణంగా ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పక్కా ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు ఆదేశం
@నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి.
అనంతరం మంత్రి బండ్ల గెరి లో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న దూద్ దవాఖానకు శంకుస్థాపన చేశారు.6 నెలలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను,కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్,మున్సిపల్ చైర్మన్ నర్సింహులు,వైస్ చైర్మన్ గణేష్,కౌన్సిలర్లు,అధికారులు ఉన్నారు.