లక్ష్మీపల్లిలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి లో ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక , ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల హెచ్ యం లు విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాళోజీ తన కవితల ద్వారా ప్రజల్లో ఉద్యమ చైతన్యo నింపిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ యాస,భాష పరిరక్షణ కు కాళోజీ విశేష కృషి చేశారన్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాష దినోత్సవం గా నిర్వహిస్తున్న సందర్భంగా ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ ను శాలువా,పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సల్వాచారి, శంకర్, అశ్విని చంద్రశేఖర్, బాసిద్, ఆశ్ర ఖాద్రి, కల్పన, రజియా బేగం, ఆఫీస్ సబార్డినెట్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.