రైతు వేదిక ను త్వరగా పూర్తి చేయాలి ... జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు.
మండలం వెంకటాపురం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను, వైకుంఠ ధామం మరియు పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని, అదే విధంగా పల్లె ప్రకృతి వనం పనులను పూర్తి చేయాలని, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలని, మండలంలో ఎంత మేరకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు అని సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతు వేదిక నిర్మాణం లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతు వేదిక చుట్టూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామంలో నాటిన మొక్కలకు నీరు పోయిస్తూన్నారా, ప్రతి మొక్కను సంరక్షించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. పూర్తి అయిన వైకుంఠధామాన్ని వినియోగంలో తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ తహశీల్దార్ కిషన్, వెంకటాపురం గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు