రైతు వేదికల నిర్మాణాన్ని వేగవంతం...కలెక్టర్ ఎస్. వెంకట రావు
రైతు వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసి 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు .
గురువారం అయన హన్వాడ మండలం బుద్ధారం గ్రామంలో రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు .ఇక్కడ రైతు వేదిక బేస్మెంట్ వరకు పూర్తికాగా పనులను వేగవంతం చేయాలని, 15 రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని తాసిల్దార్ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పల్లె ప్రకృతి వనం సందర్శించి పల్లె ప్రకృతి వనం లో పెద్ద మొక్కలు తెప్పించి నాటాలని సూచించారు .
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన డ్రైనేజీ పనులను కలెక్టర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
హన్వాడ తహసీల్దార్ బక్క శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి కిరణ్, వార్డు సభ్యులు వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి శశిధర్, శిక్షణ డిప్యూటీ తహశీల్దారులు మహేష్,లక్ష్మణ్ ,బుద్ధారం సర్పంచ్ తదితరులు ఉన్నారు