రైతులు యూరియాకు ఇబ్బందులు పడరాదు...కలెక్టర్ ఎస్.వెంకట్రావు.
యూరియా సరఫరా పై వ్యవసాయ శాఖ అధికారులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు.బుధవారం కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి వర్షాలు భారీగా కురవడంతో గతంలో కంటే ఈసారి వరిసాగు బాగా పెరిగిందని,యూరియా వాడకం కూడా పెరిగిందని,అందుచేత జిల్లా లో ఏ ఒక్క రైతు యూరియాకు ఇబ్బందులు పడరాదని, అన్యాయం జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పని చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేస్తే, ఇష్టానుసారంగా వ్యవహారిస్తే వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు, సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి అని, ఎడిఎమ్ లు మానిటరింగ్ చేయాలని, కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు సహకారం అందించాలని సూచించారు. సెప్టెంబర్ నెల మొత్తం జాగ్రత్తగా ఉండాలని, ఎరువుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రెవెన్యూ, వ్యవసాయ శాఖ వారికి పోలీస్ శాఖ వారు సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ వారు యూరియా ఎక్కడ అవసరం ఉన్నది తెలిపిన మండలానికి మాత్రమే సరఫరా చేయాలని, మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిన ఎరువులను ప్రక్క జిల్లాకు సరఫరా చేయరాదని, ఏ డీలర్ కు, ఏ సొసైటీ కి ఎంత మొత్తంలో ఎరువులు సరఫరా చేయడం జరిగిన వివరాలను నివేదిక తయారు చేసి తనకు పంపించాలని సంబంధిత వ్యవసాయ శాఖ వారికి ఆదేశించిన జిల్లా కలెక్టర్.ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, హోల్సేల్ డీలర్స్, రిటైల్ డీలర్లు, పోలీస్ శాఖ అధికారులు, కో-ఆపరేటివ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.