మాట నిలబెట్టుకుని ప్రభుత్వం

 తెలంగాణ ముఖ్యమంత్రి  సెప్టెంబర్ 17న  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోలేదని జిల్లా బిజెపి అధ్యక్షులు ఎర్ర శేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రంలో మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథులుగా జిల్లా బిజెపి అధ్యక్షులు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నాయకులు శ్రీధర్ వేణు తదితరులు పాల్గొన్నారు.