మాజీ తహసీల్దార్ నిరంజన్ మృతి.

 ఫరూక్ నగర్ మండల తాసిల్దార్ గా గతంలో విధులు నిర్వహించి అందరి మన్ననలను పొందిన రెవెన్యూ అధికారి, మాజీ రిటైర్డ్ తాసిల్దార్ నిరంజన్ మృతి చెందారు. అనారోగ్యంతో రాత్రి ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం ఆయన జిఎంఆర్ ప్లాజాలో

పిఆర్ఓ గా పనిచేశారు. నిరంజన్ అందరికీ సుపరిచితులు. రెవెన్యూ విషయాల్లో ఆయన మంచి సేవలు అందించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఇక్కడ తాసిల్దార్ గా విధులు నిర్వహించడం విశేషం. ఆయన మృతి పట్ల షాద్ నగర్ టీఎన్జీవోస్ తాలూకా అధ్యక్షులు ఎం.వెంకట్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.