మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలు... మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామంలోని వరదరాజు చెరువులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ వెంకట రావుతో కలిసి వరదరాజు చెరువులో ఉచితంగా చేప పిల్లలను రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ వదిలారు, దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ రిజర్వాయర్ లో దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి తో కలిసి ఉచిత చేప పిల్లలను వదిలిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ జిల్లాలో మత్స్యసంపద పెరుగుతుందని మత్స్య కార్మికులకు ఈ జిల్లాల నుండి ఉపాధి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు, జిల్లాలో అన్ని కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనేదే మా లక్ష్యం, గ్రామాలలో ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందేలా చేయాలనేది మా ఉద్దేశ్యమని, అదే విధంగా అన్ని చెరువులు 365 రోజులు నీటితో నిండుగా ఉండేలా కృషి చేస్తామని మత్స్యకారులు స్టాల్స్ను దుకాణాలు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపట్టి అభివృద్ధి చెందాలని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలంగా ఉంచేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటి వరకు అనేక చెరువులలో చేపపిల్లలను వదలడం జరిగినదని, భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చెరువులో ఏడాదిపాటు మీరు ఉండేలా చేస్తామని పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ ద్వారా కోయిల్ సాగర్ లో కూడా 365 రోజులు నీటితో నిండుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కోయిల్ సాగర్ కోయిలకొండ మహబూబ్ నగర్ బాగా అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడానికి అన్ని విధాల అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి అన్నారు.