భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలి ... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు

  వివిధ ప్రాజెక్టులు, రహదారులు,రైల్వే పనుల నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణ పనులను పెండింగ్ లో ఉన్నవి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.

      మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి  భూసేకరణపై రెవిన్యూ, ఇంజనీరింగ్ అధికారులు, తాసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
       ముందుగా కలెక్టర్ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కు సంబంధించి అవార్డుల విషయం, అదేవిధంగా చెల్లింపులు ,అప్పనపల్లి రైల్వే బ్రిడ్జ్ భూసేకరణ పనులు ,జడ్చర్ల నవాబ్ పేట మండలాలలో భూసేకరణ పనులను కలెక్టర్ సమీక్షించారు .ఉద్యాన శాఖ ద్వారా  ఉద్యాన మొక్కల లెక్కింపు, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన భూసేకరణ కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎల్ ఆర్ యు పి లో తప్పిపోయిన మ్యుటేషన్ ల పని, అదేవిధంగా పెండింగ్ పనుల పై కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు.
        ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నంద లాల్,  డి ఆర్వో స్వర్ణలత, ఇంజనీరింగ్ అధికారు లు,తాసిల్దారులు, తదితరులు హాజరయ్యారు.