భూమి నుండి అప్పుడ‌ప్పుడు వ‌స్తున్న స్వ‌ల్ప శ‌బ్దాల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్దు

 సైంటిస్టులు, అధికారుల‌తో క‌లిసి బోర‌బండ‌లో ప‌ర్య‌టించిన డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌

 
భూమి నుండి అప్పుడ‌ప్పుడు వ‌స్తున్న స్వ‌ల్ప శ‌బ్దాల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్దు
 
 
పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్దు - ఎక్క‌డా స్వ‌ల్పంగా కూడా భూమి కంపించ‌లేదు - ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు.
 
ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వం అండ‌గా ఉన్న‌ది
 
శుక్ర‌వారం రాత్రి నుండి జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం బోర‌బండ డివిజ‌న్‌లోని ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్, సైట్‌-3, 4, 5, సాయిబాబా న‌గ‌ర్ ప్రాంతంలో భూమి నుండి అప్పుడ‌ప్పుడు స్వ‌ల్ప స్థాయిలో వ‌స్తున్న శ‌బ్దాలకు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని డిప్యూటి మేయ‌ర్ మ‌హ్మ‌ద్ బాబా ఫ‌సియుద్దీన్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్దు - ఎక్క‌డా స్వ‌ల్పంగా కూడా భూమి కంపించ‌లేదు - ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదని తెలిపారు. పుకార్ల‌ను, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేసే వ్య‌క్తుల‌పై కేసులుపెట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు అధికారుల‌ను కోరిన‌ట్లు తెలిపారు. శ‌నివారం  జాతీయ భూ భౌతిక ప‌రిశోధ‌న కేంద్రం (ఎన్‌.జి.ఆర్‌.ఐ) సీనియ‌ర్ సైంటిస్ట్‌లు శేఖ‌ర్‌, న‌రేష్‌, సురేష్‌, జిహెచ్ఎంసి డిప్యూటి క‌మిష‌న‌ర్ ఎ.ర‌మేష్‌, ఎగ్జిక్యూటీవ్ ఇంజ‌నీర్ రాజ్‌కుమార్, ఏ.ఎం.హెచ్.ఓ బింధు భార్గ‌వి, ఖైర‌తాబాద్ త‌హ‌శీల్దార్ హ‌సీనాభేగంల‌తో క‌లిసి ఆ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు.
 
 శ‌బ్దాల తీవ్ర‌త‌ను గుర్తించుట‌కు బోర‌బండ డివిజ‌న్‌లోని నాట్కో స్కూల్‌, సాయిబాబా న‌గ‌ర్‌లోని క‌మ్యూనిటీహాల్‌, ఎన్‌.ఆర్‌.ఆర్ పురంలోని సైట్‌-4, 5 మ‌ధ్య భూకంప తీవ్ర‌త‌ను గ‌ణించే సిస్మోగ్రాఫ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. స్వ‌ల్ప శ‌బ్దాల‌కు గ‌ల కార‌ణాల‌ను ఎన్‌.జి.ఆర్‌.ఐ శాస్త్ర‌జ్ఞులు విశ్లేసిస్తార‌ని తెలిపారు. గ‌తంలో 2016, 2017 లో కూడా ఇదేవిధ‌మైన శ‌బ్దాలు భూమి నుండి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.  
 
అధికారులు ఇంటింటికి తిరిగి ప్ర‌జ‌ల‌కు మ‌నోధైర్యం క‌ల్పించిన‌ట్లు తెలిపారు. అన్ని ప్ర‌భుత్వ విభాగాలు ప్ర‌జ‌లు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురికావ‌ద్ద‌ని డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ కోరారు.