భివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

  మహబూబ్నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .

       మంగళవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీ లో కోయనగర్ లో 15 లక్షల రూపాయల వ్యయంతో  బోయపల్లిలో24 లక్షల రూపాయల వ్యయంతో, పాత మరియు కొత్త మోతీనగర్లో 34 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన  సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
       ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈరోజు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగినదని,  పేద ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా వారికి అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని, పది రెసిడెన్షియల్ పాఠశాలల పక్కా భవనాలు నిర్మాణం చేసేందుకు పది కోట్ల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, యువత నాయకులు ఐక్యం గా ఉండాలని,పట్టణ అభివృద్ధి లో యువకులు భాగస్వామ్యం కావాలని మంత్రి అన్నారు.
       ఈ కార్యక్రమములో  అడిషనల్ కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సిములు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.