ప్రభుత్వ భూములను కబ్జాలకు గురికాకుండా చూడాలి కలెక్టర్ వెంకట్రావు.
జిల్లాలో ఉన్న చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జాలకు గురికాకుండా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు.
గురువారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న చెరువులను ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురి కాకుండా పై రక్షించేందుకు రెవెన్యూ మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ, సర్వే ల్యాండ్ అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమణలను జరుగకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎఫ్ టి ఎల్ లను గుర్తించాలని, ఆక్రమణలపై ఉక్కు పాదం మోపాలని, అందుకు కిందిస్థాయి సిబ్బంది నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి పని చేస్తే చెరువులను, భూములను కబ్జాలకు గురి కాకుండా పరిరక్షించుకోవచ్చు అని సంబంధిత అధికారులకు సూచించిన కలెక్టర్.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రామారావు డి ఆర్ ఓ కే స్వర్ణలత ఆర్డీవో శ్రీనివాస్ సర్వే అధికారి శ్యాంసుందర్ ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ సురేందర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు