ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలి

 ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని మహబూబ్ నగర్ డిఎం అండ్ హెచ్వో డాక్టర్. కృష్ణ తెలిపారు .జాతీయ ఆసొక్రమిక వ్యాధుల నివారణలో భాగంగా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ బిపి పరీక్షలు చేయించుకోవాలన్నారు .గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిఎంఅండ్ హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ కార్నర్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రికి వచ్చే ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బీపీ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో కార్డియో వాస్కులర్ హెల్త్ ఆఫీసర్ (డబ్లుహెచ్ఓ) మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రిలో బీపి మందులు నిల్వ ఉంచాలని ప్రతి ఒక్క బీపీ చేసేందుకు ట్రీట్మెంట్  కార్డు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా మందులు వాడేస్తూ వారికి సూచించాలని అధికారులకు సూచించారు .ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ సునీత, జిల్లా మాస్ మీడియా అధికారి తిరుపతిరావు, 104 జిల్లా సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి,  హెల్త్ ఎడ్యుకేటర్లు గోపాలాచారి, గొనెల నాగరాజు ,నాగరాజు శెట్టి ,తదితరులు పాల్గొన్నారు .