ప్రజా కవి కాళోజీ 106 వ జయంతి నివాళులర్పించారు కలెక్టర్ ఎస్.వెంకట రావు

 తెలుగు భాష, తెలంగాణ ల కోసం కృషిచేసిన మహనీయుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు అన్నారు.

      ప్రజా కవి కాళోజీ 106 వ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అని కాళోజీ నారాయణ రావు తన రచనల ద్వారా తెలంగాణ సమాజానికి స్పూర్తి కలిగించారని  అన్నారు.ముఖ్యంగా తన కవితలు,పద్యాల ద్వారా  యువతలో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారన్నారు.  నేటి యువతకు ఆయన రచనలు ,కవితలు స్పూర్తి దాయకమని అన్నారు. తెలంగాణ సాధనలో ప్రత్యేకించి తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు. కాళోజీ నారాయణరావు సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ బిరుదునిచ్చి ఘనంగా సత్కరించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని రాష్ట్ర భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నదనితెలిపారు.
       ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.