ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి....కలెక్టర్ యస్.వెంకట్ రావు

   ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్.వెంకట్ రావు అన్నారు.

       సోమవారం కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ప్రజావాణి వాట్స్ అప్ వీడియో కాల్  నంబర్కు 11 మంది ఫిర్యాదుదారులు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా  తమ ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు  సంబంధిత అధికారులతో చర్చించి   పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని  తెలిపారు. 
      ఈ ప్రజావాణి వాట్సాప్ వీడియో కాల్ కు వచ్చిన కాల్స్ లలో ముఖ్యంగా భూములకు సంబంధించిన సమస్యలు, పెన్షన్లు సమస్యలు ఉన్నాయి. 
        ఈ వాట్సాప్ వీడియో కాల్ ప్రజావాణి కార్యక్రమానికి  అడిషనల్ కలెక్టర్ సీతారామరావు, తేజాస్ నంద్ లాల్, డి ఆర్వో కె. స్వర్ణలత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.