ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలి ... కలెక్టర్ ఎస్.వెంకట రావు
కరోన దృష్ట్యా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రవేశ పెట్టిన ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.
వివిధ జిల్లా,మండల కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కరోనా వల్ల ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా అధికారులు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ఆన్లైన్లో ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు .ఈ విధానం ద్వారా ఆన్లైన్లోనే ఫిర్యాదుదారు తన ఫిర్యాదులను వీడియో కాల్ ద్వారా తెలియచేయవచ్చని, అవసరమైతే ఇతర అధికారులతో కూడా ఆన్లైన్ లోనే వాట్స్అప్ ద్వారా ఒకేసారి ఇద్దరు, ముగ్గురు మాట్లాడేల ప్రత్యేకమైన నంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎక్కువగా సందర్శించ ముఖ్యమైన జిల్లా కార్యాలయాలతో పాటు అందరూ తాసిల్దార్లు, ఎం పీ డీ వో లకు ఈ వాట్సాప్ వీడియో కాల్ చేసేందుకు ప్రత్యేకంగా సిం కార్డులను కొనుగోలు చేసి నంబర్లను ఇవ్వడం జరిగిందని, తెలిపార.
ప్రతి సోమవారం ఉదయం 10 .30 గంటల నుండి ప్రజల ద్వారా ఫిర్యాదులను ఆన్లైన్లో స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వీడియో కాల్ లో ఫిర్యాదు దారు మాట్లాడిన అనంతరం తన సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వాట్స్అప్ వీడియో కాల్ చేసిన నంబర్ కె అప్లోడ్ చేయవచ్చు అని తెలిపారు. ఏ వారం వచ్చిన ఫిర్యాదులను ఆవారమే పరిష్కరిస్తామని,అంతే కాకుండా అవసరమైతే ఫిర్యాదుదారు మొబైల్ నెంబర్ కూడా రికార్డు అయి ఉంటుంది కాబట్టి తర్వాత కూడా వారి సమస్యను పరిష్కరించేందుకు ఎన్నిసార్లైనా తిరిగి మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు .పిర్యాదుదారులు వాట్స్అప్ వీడియో కాల్ ద్వారా ఆధికారులకు మాట్లాడి సమస్య తెలియజేసి,డాక్యుమెంట్ అప్లోడ్ చేయవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టర్ తో నేరుగా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ సమస్యను పరిష్కరించుకోదలచిన ఫిర్యాదుదారులు తన నంబర్ 9154463001కు వుదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 వరకు కాల్ చేయవచ్చని తెలిపారు. సాధారణ సమయంలో కూడా ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను పైన పేర్కొన్న నంబర్‌కు అప్లోడ్ చేయవచ్చని ఆయన తెలిపారు. వీలైనంత వరకు ప్రజలు కార్యాలయాలకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రజలు జిల్లా , మండల అధికారులకు చేయవలసిన వాట్సాఅప్ వీడియో కాల్ నంబర్లు ఈ కింద ఇవ్వనైనది