పాడుపడిన ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు

భారీ వర్షాల కారణంగా జిల్లాలో పాడుపడిన ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు తాసిల్దార్ లను ఆదేశించారు.
       శనివారం ఆయన వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారీ వర్షాలపై తాసిల్దార్ లతో సమీక్ష నిర్వహించారు.
           భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని తాసిల్దార్లు ఎవరు సెలవుపై వెళ్ళకూడదని, జిల్లా యంత్రాంగానికి 24 గంటలు అందుబాటులో ఉండాలని, అంతేకాక డిప్యూటీ తాసిల్దార్లు కూడా జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. చెరువులు, కుంటలు, అలాగే  భారీగా నీరు ప్రవహించే చోట హెచ్చరిక బోర్డులను, బ్యానర్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పాడుబడిన ఇండ్లలో నివసించే వారిని గుర్తించి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికోసం  సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని  అన్నారు.ఏ ఒక్కరు  ఉండే నదులు,చెరువులు,చెక్ డ్యాములు,వాగులు,  నీరు నిలువ ఉన్న చోటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. ప్రజలను భారీ వర్షాల పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు.   వీఆర్ఏలు,విఆర్ ఓ ల సేవలను వినియోగించుకోవాలని ఆయన తహశీల్దార్లను ఆదేశించారు.

       ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్ఓ కే. స్వర్ణలత తదితరులు హాజరయ్యారు.