పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

 గండీడ్: పశువులకు వర్షాకాలం సోకే వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని హెరిటేజ్ డైరీ ఇంచార్జ్ సందీప్ రెడ్డి తెలిపారు శనివారం మండలంలోని నంచర్ల గ్రామంలో హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు పశువులు అనారోగ్యానికి గురైన వెంటనే పశు వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు . హెరిటేజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు క్యాల్షియం, మినరల్ మిక్చర్,  దాన సబ్సిడీలో అందజేయనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హాజీ షరీఫ్, వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి, పాల సేకరణ ప్రతినిధులు మహేష్ రెడ్డి పాడి రైతులు పాల్గొన్నారు.