పలు సమస్యల పై ప్రస్తావించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో దేవరకద్ర నియోజకవర్గం లోని పలు సమస్యల పై ప్రస్తావించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి 
 
కొత్తకోట మండలంలో మూడు సంవత్సరాల క్రితం కనిమెట్ట జంగమాయపల్లి మధ్యలో రోడ్డు కు 2 కోట్ల 60 లక్షల నిధులతో మంజూరు చేసుకొని శిలాఫలకం వేసి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది... కానీ ఇసుక లోతుగా ఉండటం వల్ల డబ్బులు ఎక్కువ అయి డిజైన్ చేంజ్ అయి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి...మొన్న వర్షాలకు సంబంధించి రెండు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడితే పడవ ఏర్పాటు చేసుకొని రాకపోకలు చేయాల్సి వచ్చింది.....  కావున సంబంధిత మంత్రి గారు చొరవ తీసుకుని ఫైల్ ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్రటరీ దగ్గర ఉంది  మంత్రి గారు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆ గ్రామ ప్రజలకు రాకపోకలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోని ఆయా గ్రామ ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం....
 
అదే విధంగా భారీ వర్షాలకు నా నియోజకవర్గం లోని వర్నె , గౌరీదేనిపల్లి , సీతారాం పెట్ గ్రామాల్లో RNB , PRB రోడ్లకు సంబంధించి రోడ్లు కొట్టుకుపోవడం వల్ల ఒక్కో ఊరు దగ్గర రోడ్డు కొట్టుకుపోవడం వల్ల  దాదాపు 5 & 6 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది...కావున ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రత్యేక నిధులతో అయిన వెంటనే చర్యలు తీసుకొని రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం....
 
ఈ రోజు తాండల కు సంబంధించిన రోడ్లలో లక్ష , రెండు లక్షలు ఖర్చు పెడుదాం అంటే కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే ల దగ్గర నిధులు లేవు కావున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని దీని గురించి కూడా ఆలోచించి పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము.....
 
మంత్రి కేటీఆర్ గారు స్పందిస్తూ....
 
గౌరవ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు చెప్పిన అన్ని విషయాల ను నోట్ చేసుకోవడం జరిగింది.... తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు