నిరుపేద గిరిజన రైతులు అభివృద్ధి కోసం గిరి వికాసం పథకం

 జిల్లాలో నిరుపేద గిరిజన రైతులు అభివృద్ధి కోసం గిరి వికాసం పథకం ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు.

 
బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 482 మంది రైతులను గుర్తించడం జరిగిందని, వారి అభివృద్ధి కై చేపట్టిన పనులు ఎంత వరకు పూర్తి చేసిన వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు,  పనులను వేగవంతం చేయుటకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు సూచించారు.
 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ తేజాస్, డిఆర్డిఎ అధికారి వెంకట్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ వర్క్స్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.