దేవరకద్ర యంఈఓగా జయశ్రీ - పీఆర్టియు నేతల అభినందనలు

 దేవరకద్ర మండల విద్యాధికారిగా కె.జయశ్రీ నియమితులయ్యారు. ఇదివరకు ఎఫ్ఎసి యంఈఓ గా ఉన్న యం.నారాయణరెడ్డి ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో మహబూబ్ నగర్ అర్బన్, రూరల్ మండలాల యంఈఓ గా విధులు నిర్వహిస్తున్న  కె.జయశ్రీ ని దేవరకద్ర మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డిఇఓ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.  కాగా దేవరకద్ర మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె. జయశ్రీని పీఆర్టియు టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్, అసోసియేట్ అధ్యక్షులు బుచ్చారెడ్డి, మండల అధ్యక్షులు పురేంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.అంజయ్య, ఉపాధ్యక్షులు ఆంజనేయ రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యం ఈ ఓ జయశ్రీ మాట్లాడుతూ ఆన్ లైన్ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. నిరంతరం   విద్యార్థులను పర్యవేక్షిస్తూ ప్రతి విద్యార్థి ఆన్ లైన్ తరగతులు సద్వినియోగం చేసుకునులే ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.