దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

 హిందు వాహిని పేరుతో దళితుల పట్ల జరుగుతున్నదాడుల పట్ల పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించడం సరికాదని దళిత సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని బోయిన్ పల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా యువకుల మధ్య  జరిగిన చిన్న కొట్లాటను మనసులో పెట్టుకుని దళిత యువకుడు శివ పై కులాల మధ్య చిచ్చుపె ట్టే విధంగా కాపు కాసి దాడికి పాల్ప డి న హిందువాహిని నాయకులపై కేసులు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో జరిగిన ఇరువర్గాల దాడి లో గాయాల ప డిన వ్యక్తి పిర్యాదు మేరకు తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారని, అదేరోజు దళిత యువకుడు శివ పై దారికాసి కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడి న వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన నేటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. జిల్లా ఎస్పి ప్రత్యేక దృష్టి సారించి నిస్పక్షపాతంగా విచారణ జరిపి గ్రామంలో కులాల మధ్య చిచ్చపెట్టిన వారిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగయ్య, ఆనంద్, మంగి విజయ్, బండి విజయ్ కుమార్,  వెంకటయ్య, ప్రదీప్ కృష్ణయ్య, బాలయ్య, విజయ్,  సురేష్, సుభాష్, రాధాకృష్ణ, సుకుమార్, మంద భీమ్ రాజ్,  దీపక్, రవి, శ్రీను, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.