త్యాగాలకు ప్రతీక మొహరం...ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి

 ధర్మ పరిరక్షణ కోసం మహమ్మద్ ప్రవక్త వారసులైన హసన్ హుస్సేన్ ల త్యాగాల గుర్తుగానే మొహరం జరుపుకుంటారని ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.కర్బలా యుద్ధం లో మహమ్మద్ ప్రవక్త మనవలు హసన్ హుస్సేన్ లతో పాటు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా మొహరం ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు.తెలంగాణలో మతసామరస్యాన్ని సమైక్యత భావనను పరి రక్షించడానికి ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్ని మత విశ్వాసాలను తాము సమానంగా గౌరవిస్తామని ఆ క్రమంలోనే మసీదులో  ఇమామ్లకు చర్చిలో పాస్టర్లకు దేవాలయాల్లో పూజారులకు గౌరవ వేతనాన్ని అందిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.మరోసారి ఆయన ప్రజలకు మొహరం శుభాకాంక్షలు తెలిపారు....