డిగ్రీ కాలేజ్ లో బొటానికల్ గార్డెన్ అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు మంజూరు

 

 
 
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి  ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్  సదా శివయ్య , జూనియర్ కాలేజ్ లెక్చరర్ రఘురామ్  ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో కలిశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన వివరాలు  లెక్చరర్ సదశివయ్య ని అడిగి తెలుసుకున్నారు. వారిని అభినదించారు. అలాగే ముఖ్యమంత్రి  మాట ప్రకారం డిగ్రీ కాలేజ్ లో బొటానికల్ గార్డెన్ అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాదేపల్లి నందు మద్యాహ్న భోజనం అందిస్తున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం బాలురా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో కూడా లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెడుతున్న విషయం తెలియచేశారు. ఈ సందర్భంగా  రఘురాం ని అభినందించారు. మరియు కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సిఎం అన్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మద్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మద్యాహ్న భోజనం అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అభ్యర్ధన మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి  తెలిపారు.