జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అశ్విని చంద్రశేఖర్
17 అక్టోబర్ 2002 ఎస్ జి టి ఉపాధ్యాయులుగా మొదట మద్దూరు మండలం పి.ఎస్.కిషన్ నగర్ లో నియామకమయ్యారు. ఏడేళ్ల పాటు అక్కడ పనిచేసి ఆ తర్వాత హన్వాడ మండలం పి.ఎస్.రామన్న పల్లికి బదిలీ అయ్యారు. రామన్న పల్లి లో సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు పనిచేసిన చంద్రశేఖర్ జులై 2018 లో దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం లక్ష్మీ పల్లి లో ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కూడా ఒక సామాజిక స్పృహ తో విద్య,సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కు ఉత్తమ విద్యను అందించాలనే తపనతో విధులు నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అశ్విని చంద్రశేఖర్ తాను పనిచేస్తున్న పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అను నిత్యం పరితపిస్తారు.తనకు పరిచయం ఉన్న మిత్రుల సహకారం తో తాను కొంత భరిస్తూ.. దాతల చేయూత ,ప్రజల భాగస్వామ్యం తో పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పలకలు, బ్యాగులు,టై బెల్టు లు, ,ప్లేట్లు, గ్లాసులు,వాష్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది . పాఠశాలకు అవసరమైన వాటర్ ట్యాంకు లు ,మ్యూజికల్ డ్రమ్స్, మైక్ సెట్ ,ఫర్నిచర్ లను సమకూరుస్తూ అందరిచే శభాష్ అనిపించుకు o టున్నారు చంద్రశేఖర్. పచ్చదనం - పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ పెద్ద మొత్తంలో మొక్కలను నాటుతూ వాటిని సంరక్షించడం జరిగింది. అదే విధంగా వివిధ రకాల సామాజిక అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్న చంద్రశేఖర్ కు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు దక్కింది.