చేప పిల్లల వదిలిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.
గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేసీఆర్ అర్బన్ ఏకో పార్కులోని చెరువులో, అప్పన్నపల్లి లో గొంగోస్ కుంట చెరువులో, పోసాని కుంట చెరువులో జిల్లా కలెక్టర్ వెంకట్ రావు తో కలసి చేప పిల్లల ను వదిలిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.
చేప పిల్లల వదిలిన అనంతరం మంత్రి మాట్లాడుతూ మత్స్య
కార్మికులకు అన్ని రకాల ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు లో ఇక్కడి నుంచే చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధంగా అభివృద్ధి చేస్తామని, జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తూన్నమని మంత్రి తెలిపారు
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, డిసిసిబి వైస్ చైర్మన్ కోరమోనీ వెంకటయ్య,జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఎడి ఫిషరీస్ రాధరోహిణి, తదితరులు పాల్గొన్నారు.