చిన్నారుల ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకున్నమంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

 గండీడ్ మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన కేశవులు, కృష్ణవేణి దంపతులకు జన్మించిన కవల ఆడపిల్లలకు తండ్రి అయిన కేశవులు గొంతులో విషం పోసి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగిందని, వారిని జిల్లాలోని రవి చిల్డ్రన్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలుసుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆస్పత్రిని సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకున్న అనంతరం మంత్రి మాట్లాడుతూ అమానుషమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అమలు చేయాలని, మారుతున్న సమాజంలో పురుషులతో పాటు మహిళలు సమానంగా పనిచేస్తున్నారని, ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అమనుషమని, చిన్నారుల యొక్క తండ్రి రాక్షసత్వానికి ప్రతీక అని, అతనికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, అతనిని వదిలి పెట్టె ప్రసక్తే లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా అంగన్వాడీ వర్కర్లతో, ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. చిన్నారులను ప్రాణాపాయ స్థితినుండి బయటకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న డాక్టర్ శేఖర్ ను మంత్రి అభినందించారు.