ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

 మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడి ఆద్య తండ్రి కల్యాణ్ బలవన్మరణం చెందాడు. ఆత్మకూరు(ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా కల్యాణ్ పనిచేసేవాడు. ఇటీవల కల్యాణ్ కుమార్తె ఆద్యను కరుణాకర్ అనే వ్యక్తి హత్య చేశాడు.