గ్రామీణ ప్రాంతాలలో ఆస్తుల నమోదు జాగ్రత్త అప్డేట్ కలెక్టర్ ఎస్. వెంకట రావు
గ్రామీణ ప్రాంతాలలో ఆస్తుల నమోదు లో భాగంగా సమాచారాన్ని జాగ్రత్తగా అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు సిబ్బందిని ఆదేశించారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు .
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక యజమాని కి సంబంధించి వివరాల అప్డేషన్ కు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఆస్తుల నమోదు కు సంబంధించిన వివరాలు జాగ్రత్తగా అప్డేట్ చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. ఆస్తుల నమోదుపై ఇంటింటికి వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆస్తులకు హక్కులు కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు .వ్యవసాయ భూములకు హక్కులు కల్పించినట్లుగానే వ్యవసాయేతర ఆస్తులకు కూడా ప్రజలకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని రీతిలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ,ట్రాలీ, ట్యాంకర్ తదితర అన్ని సౌకర్యాలు కల్పించిందని సర్పంచ్ తో అన్నారు. ప్రతి ఊర్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పల్లె ప్రకృతి వనాలనుతీసుకు వచ్చిందని అన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట డి పి ఓ వెంకటేశ్వర్లు ,ఎంపీవో నరేందర్ , సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి ఉన్నారు