గ్రామాల్లో ప్రజలు కూడా మాస్కులు ధరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

 కరోనా బారిన పడకుండా ఎవరికి వాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి గృహాన్ని సందర్శించారు. వానలోనే కాలనీలో తిరిగారు. కిరాణా షాపులు, పండ్ల బండ్లు, పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు.. పలువురు మాస్కులు లేకుండా ఉండటాన్ని గమనించిన మంత్రి... కరోనాతో ఆటలాడవద్దని అన్నారు. కరోనా వల్ల ఏదైనా జరగరాని నష్టం జరిగితే కుటుంబం వీధిన పడుతుందని హితవు పలికారు. గ్రామాల్లోని ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించే విధంగా చైతన్యం చేయాలన్నారు. మాస్కు ధరించని వారిపై ఫైన్ విధించాలని ఆయన కలెక్టర్​కు తెలిపారు.