క్రీడాకారులకు చేయూత మక్తల్ MLA చిట్టెం రామ్మోహన్ రెడ్డి

 నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని  మినీ స్టేడియంలో గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్రీడా దినోత్సవానికి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో  ప్రతి ఒక్కరు కరోనా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.. ప్రజలు ప్రతిరోజు వ్యాయామం చేయడం తో పాటు  రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు  చిట్కాలను పాటించాలి అన్నారు. క్రీడాకారులు అందరూ మేజర్ ధ్యాన్ చంద్  ను స్పూర్తిగా తీసుకుని  క్రీడాకారులు రాణించాలని అన్నారు... ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి ఉద్దేశంతో  ప్రతి జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు గవినోళ్ళ గోపాల్   రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం.. క్రీడలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్రంలో ప్రతిభగల క్రీడాకారులను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని  వెల్లడించారు.క్రీడాకారులను ప్రోత్సహించేందుకు  తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.. ప్రతిభగల క్రీడాకారులకు  తను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.... ప్రతిభగల క్రీడాకారులను. రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి  క్రీడల్లో పాల్గొనే విధంగా చేయూత అందిస్తానని  గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రతిభగల క్రీడాకారులను కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న పలువురుని ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు..