కొత్త రెవెన్యూ కోడ్ అమలు

 బుధవారం నుండి  కొత్త రెవెన్యూ కోడ్ అమలులోకి వచ్చినందున భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులకు తుది తీర్పులు ఇవ్వకూడదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

      బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ కోర్టు కేసులపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
      జాయింట్ కలెక్టర్ ,ఆర్ డి ఓ, తాసిల్దారులు వారి పరిధిలో పెండింగ్లో ఉన్న ఎలాంటి కేసయినా సరే ఫైనలైజ్ చేయకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా పాత తేదీలతో భూమికి సంబంధించిన కేసులను ఫైనల్ చేస్తే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తో పాటు ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తాసిల్దార్ ల వద్ద పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
       ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, డిఆర్ఓ స్వర్ణలత ,తహసీల్దార్లు పాల్గొన్నారు