కేసీఆర్పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
వరంగల్: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారా? అని ప్రశ్నించారు. సీఎం నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామని, కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని. కరోనా కష్టకాలంలో తెలంగాణకు కేంద్రం 20లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయని అరవింద్ ఆరోపించారు. ఎంపీ ఓవైసీని జిన్నాతో పోలుస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టాడని దుయ్యబట్టారు. కేసీఆర్ పెద్దకొడుకు ఓవైసీ అని కాంగ్రెస్ దేశానికి పట్టిన దరిద్రమని అరవింద్ మండపడ్డారు.