కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ... మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.
మంగళవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లి తండ్రులకు భారంగా మారకూడదన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నదని, ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 321 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకురేలా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్, మున్సిపల్ ఛైర్మన్ నర్సిములు, అర్బన్ తహశీల్దార్ పార్థసారథి, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.