కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను పరిశీలించిన డా.వి.శ్రీనివాస్ గౌడ్.

పాల్కోండలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావుతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్.శుక్రవారం కలెక్టరేట్ భవన నిర్మాణం పనులు పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 58 కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మించడం జరుగుతున్నదని, దేశంలో ఎక్కడలేని  విధంగా ఒకే చోట ఉండాలని సమీకృతంగా నిర్మాణాలను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని, అతిత్వరలో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీద ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు, నిర్మాణ పనులు  వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తీర్చిదిద్దే లా అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ సీతారామరావు, మునిసిపల్ చైర్మన్ కేసి నర్సిములు, వైస్ చైర్మన్ గణేష్, ఆర్డీఓ శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ సురేందర్, తహసీల్దార్ పార్థసారథి, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.