కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై అధికారులతో సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

   జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మెడికల్ కళాశాల డైరెక్టర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు ప్రోగ్రామింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

 
       సోమవారం కలెక్టర్ ఛాంబర్లో వైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతునందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హోమ క్వరంటైన్లో ఉన్న వారిని గుర్తించి వారికి ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం కలిగించాలని, ప్రతి ఒక్క పాజిటివ్ వచ్చిన వారి వద్దకు వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇవ్వాలని, హోమ్ ఐసోలేషన్ లో ఉండే ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి డాక్టర్లు, ఆర్.బి.ఎస్.కె డాక్టర్లు, ఆశా వర్క్లు, ఎఎన్ఎంలు వెళ్లి పరిశీలించి పేషెంట్ పరిస్థితికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని, మీకు కేటాయించిన విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీకు కేటాయించిన ప్రాంతాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్ళి టెస్టులు చేయించిహోమ్ ఐసోలేషన్ కు పంపి వారికి మెడికల్ కిట్లు అందించి, రోజు వారి చెక్అప్ చేస్తున్నారా, వారి పరిస్థితి ఫోన్ ద్వారా అడిగి తెలుసుకొని ధైర్యం చెబుతున్నారా అన్ని వివరాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ నందు అడ్మిట్ అయిన పేషెంటుకు సంబందించిన పరిస్థితిని వారి కుటుంబ సభ్యులకు కు తెలియజేస్తున్న రాలేదని సమీక్షించారు. పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యతా లోపం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
       ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ రాంకిషన్, ప్రోగ్రామింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.