ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహన
రంగారెడ్డి పాలమూరు హైదరాబాదు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియపై తాహసిల్దార్ శంకర్ వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు.
శనివారం ఈ మేరకు మండల తాహసిల్దార్ కార్యాలయంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఇతర పార్టీల నాయకులతో మాట్లాడుతూ గ్రామస్థాయిలో పట్టభద్రులను గుర్తించి వారి వివరాలను సేకరించి ఓటర్ నమోదు ప్రక్రియను, నూరు శాతం పెంచాలని కోరారు.
ఈ విషయంపై పట్టభద్రులు అవగాహన కలిగి ఉండి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా తాహసిల్దార్ శంకర్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ ఉపాధ్యక్షుడు రాచమల్ల యాదగిరి బిజెపి పార్టీ జిల్లా నాయకులు పల్లె శేఖర్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నరహరి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాలమేని లింగం వార్డు మెంబరు గోనెల రమేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.