ఆన్లైన్ తరగతులు, విద్యార్థుల హాజరు మరియు మ్యాపింగ్ పై వీడియో కాన్ఫరెన్స్
సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు, విద్యార్థుల హాజరు మరియు మ్యాపింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు టి సాట్ విద్య, నిపున యాదాద్రి ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందని, విద్యార్థులు టీవీల ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా వింటున్నారా లేదా మానిటరింగ్ చేయాలని, టీవీలు, మొబైల్ ఫోన్స్ లేని విద్యార్థులను ఉన్న విద్యార్థులతో మ్యాపింగ్ చేయాలని, పంచాయతీ సెక్రెటరీలు, వీఆర్వోలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ ఆన్లైన్ తరగతులు గురించి అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు, హెడ్మాస్టర్ లకు సహకారం అందించి విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలను వినేందుకు కృషి చేయాలని పంచాయతీ సెక్రటరీలు, విఆర్వోలకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు టీవీల ద్వారా పాఠాలు వినేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ లు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్వోలు కృషిచేయాలని, గ్రామాలలో గ్రామ పంచాయతీల నుండి పట్టణంలో మున్సిపాలిటీల నుండి పాఠశాలలో పారిశుద్ధ్యం పనులు తప్పకుండా నిర్వహించాలని సూచించారు ప్రతివారం 6 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం పనులు జరుగుతున్నాయా లేదా అని తనిఖీ నిర్వహించాలని ఎంపీఓలకు, ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలలో వార్డుల వారీగా, గ్రామాలలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎం పి ఓ, ఎం ఈ ఓ, స్పెషల్ ఆఫీసర్ 5 క్లస్టర్లుగా విభజించుకుని ఆన్లైన్ తరగతులను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నార లేదా మానిటరింగ్ చేయాలని, ఆన్లైన్ తరగతులను విద్యార్థులు 100% ఉపయోగించుకునేలా వీలైనంతవరకు అందరూ సమిష్టిగా కలిసి పని చేయాలని, మహబూబ్నగర్ జిల్లాలో మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచే విధంగా విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారిని ఉషారాణి, డిపిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ దశరథ్, డి ఆర్ డి ఎ పిడి వెంకట్ రెడ్డి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, స్పెషల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, యంఈఓలు, హెడ్ మాస్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.