ఆన్లైన్ తరగతులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి... జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆన్లైన్ తరగతులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎంఈవోలు హెడ్మాస్టర్ లకు కాలేజీ ప్రిన్సిపల్ ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబరు ఒకటవ తేదీ నుండి ఆన్ లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అందుకు కావలసిన ఏర్పాట్లను చేసుకోవాలని, రేపటి నుండి మీరు  మీ సిబ్బంది అంతా పాఠశాలలకు వెళ్లాలని, ముందుగా పాఠశాలలను శుభ్రం చేయించి, శానిటైజ్ చేయించాలని, టీవీలు, లాప్ టాప్ లు, మొబైల్ ఫోనులు ఉన్న విద్యార్థులను గుర్తించి లేని విద్యార్థులను వీరితో మ్యాపింగ్ చేయాలని, పాఠశాల ల్లో ఉన్న టెలివిజన్ లో తరగతులు నిర్వహించి, విద్యార్థులు  భౌతిక దూరం  పాటించి వినేలా చర్యలు తీసుకోవాలని, స్థానిక పంచాయతీ సెక్రటరీ లతో, ప్రజా ప్రతినిధులతో చర్చించి గ్రామ పంచాయతీ  కార్యాలయాలలో ఉన్న టెలివిజన్ ద్వారా తరగతులు వినేట్లుగా  ఏర్పాటు చేయాలని, అదే విధంగా కళాశాల విద్యార్థులకు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్లు తయారు చేసిన వీడియోలను అప్లోడ్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారిని ఉషారాణి ఎం ఈ ఓ లు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లో కళాశాల ప్రిన్సిపల్స్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.