ఆకుపచ్చని తెలంగాణే కేసీఆర్ లక్ష్యం

 బాలానగర్ : ఆకుపచ్చని తెలంగాణే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు లక్ష్యమని,  తెలంగాణకు హరితహారం  కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారనిటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామావత్ వాల్యానాయక్ అన్నారు.వనాల పెంపుదల కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.శుక్రవారం మండల పరిధిలోని అప్పాజీ పల్లి లోని కెసిఆర్ గుట్టపై అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.