అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసిన సర్పంచ్
మండలంలో ఉన్న పారుపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన స్మశాన వాటిక, దాన వాటికల నిర్మాణ పనులను పూర్తి చేసి పలు అభివృద్ధి పనులు వేగవంతంగా సర్పంచ్ మాణిక్యమ్మయాదయ్య పూర్తి చేయడం జరిగింది. గ్రామానికి అనుకూలం నిర్మించడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. అదేవిధంగా పల్లె ప్రకృతి కోసం మొక్కలు నాటడానికి స్థలం అనుకూలంగా ఉందని తెలియజేశారు. ట్రాక్టర్ డోజర్ ద్వారా పల్లె ప్రకృతి వనం ద్వారా మొక్కలు నాటి పెంచడానికి స్థలాన్ని లెవెల్ చేయడం జరిగింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి గ్రామ పంచాయతీ అభివృద్దే నా లక్ష్యం అని సర్పంచ్ తెలిపారు.