అధికారులు 24 గంటలు అందుబాటులో జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు జిల్లా యంత్రాగానికి 24 గంటలు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు ఆదేశం.
@ అధికారులు ఎలాంటి సెలవుపై వెళ్లొద్దు. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినమైన ఆదివారం కూడా అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి .
@వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితుల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
@ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08542-241165 కు తెలియజేయాలని విజ్ఞప్తి.
@రాష్ట్రంలో, జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నయని, వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నుండి ప్రత్యేక ఆదేశాలు. @జిల్లాలోని జిల్లా అధికారులతో పాటు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
@వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేయాలి.
@లోతట్టు ప్రాంతలలోకి నీరొచ్చే అవకాశం ఉంటే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
@ ప్రాజక్టులు,చెరువులు,కుంటలు ఇతర నీటి నిలువ ప్రదేశాలకు ఎవరు వెళ్లవద్దు.
@ప్రత్యేకించి బట్టలు ఉతికేందుకు,స్నానాలకు, ఈత కొట్టేందుకు యువత నీటిలో దిగవద్దు.మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదులు,కాలువలు,చెరువులోకి వెళ్లారాదు.
@గ్రామ స్థాయి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి.
@నీటి పారుదల, పంచాయతీ రాజ్,ఆర్ అండ్ బి,మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
@ఎక్కడైనా రహదారులు,చెరువులు,కుంటలు తెగిపోతే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి.
@వర్షాలపై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలి