అఖిల పక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట రావు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట రావు.
శుక్రవారం కల్లెక్టరటేలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయినందున ఓటరుగా నమోదు చేసుకునే అభ్యర్థులు నవంబరు 1, 2017 నాటికి డిగ్రీ పాసై ఉండాలని / డిప్లొమా చేసి ఉండాలి అని, అభ్యర్థులు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వారై ఉండాలని, ఓటరు నమోదు ప్రక్రియను ఆన్లైన్లో www.ceotelangana.nic.in ద్వారా, తహసీల్దార్ల వద్ద, డిఆర్వోల వద్ద నమోదు చేసుకోవచ్చు అని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లో ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నవంబర్ 6 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని, నవంబర్ 25 న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణ, డిసెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించటం, డిసెంబర్ 1 నుండి 31 వరకు ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలను స్వీకరించడం, జనవరి 12, 2021న అభ్యంతరాల పరిష్కరణ, జనవరి 18 ,2021 న పట్టభద్రుల ఎన్నికల తుది ఓటరు జాబితాను ప్రచురించటం జరుగుతుందని ఆయన తెలిపారు.
పట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం 18 లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫొటో ఓటరు గుర్తింపు కార్డు లోని ఎపిక్ నెంబర్,అట్టేస్ట్ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ పట్టభద్రులైన వారు చేసుకునేలా మీరంతా కృషి చేయాలని, మీరంతా సహకారం అందించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, డి ఆర్ ఓ కే .స్వర్ణలత, వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు