చిన్న చిన్న విషయాలకు గొడవల కు వెళ్ళకూడదు

గ్రామీణ ప్రాంత ప్రజలలో ఉండే ఆత్మీయతాభావం మన సంస్కృతిని ఉన్నతస్థాయిలో ఉంచుతుందని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు  అన్నారు. నేటి సోమవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి ఎస్.పి. ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా  ఎస్ పి మాట్లాడుతూ, చిన్న విషయాలకు గొడవలు చేసుకోవడం సరి కాదని, కుటుంబ తగాదాలలోనూ సంయమనం వహించాలని అన్నారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలపై మళ్లీమళ్లీ తగాదాలకు దిగుతూ శాంతికి భంగం కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుకు పోలీస్ స్టేషన్లలోనే తగిన పరిష్కారం లభించేలా స్థానిక అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకు పోలీసు నిరంతరం పని చేస్తుందని ఎస్.పి.  భరోసా ఇచ్చారు. బడి పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, పిల్లలు బావులు, చెరువులకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబ పెద్దలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరచడం జరుగుతుందని ఎస్.పి.  హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన ఎస్.పి. తగు చర్యలకై సంబంధిత అధికారులను ఆదేశించారు.