కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ ఉరేసుకున్నారు. ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ హెమ్తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే త‌న సొంతూరుకు కిలోమీట‌ర్ దూరంలో ఉన్న బిందాల్ వ‌ద్ద ఎమ్మెల్యే మృత‌దేహం క‌నిపించింది. అయితే ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై కుటుంబ స‌భ్యులు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య కాదు.. ఇది రాజ‌కీయ హ‌త్యే అని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. హ‌త్య చేసి ఉరేశార‌ని పేర్కొన్నారు.