కర్నూలు జిల్లాలోని వెలుగొడు తెలుగు గంగ కాలువ సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గొర్రెల మందపై పెద్దపులి దాడి చేయడంతో రెండు గొర్రెలు మృతి చెందాయి. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏక్షణాన ఏమీ జరుగుతందనే భయంతో ఉన్నారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, స్థానికులు వాపోతున్నారు.
కర్నూలు జిల్లాలో పెద్దపులి సంచారం